: కనేరియా భారత్ పర్యటనకు వచ్చాడా? వలస వచ్చేశాడా?


పాకిస్థాన్ జాతీయ క్రికెటర్ డానిష్ కనేరియా భారత్ కు వచ్చాడు. అకస్మాత్తుగా భారత్ కు డానిష్ కనేరియా రావడం పట్ల పాకిస్థాన్ లో కలకలం రేగుతోంది. కాగా, అతని సోదరుడు వికీ కనేరియా మాత్రం తన సోదరుడు భారత్ లో పూజలు చేసేందుకు వచ్చినట్టు చెబుతున్నాడు. అయితే తాను హిందువును కావడం వల్లే పాకిస్థాన్ జట్టులో న్యాయం జరగడం లేదని, భారత్ లో అయితే న్యాయం జరిగి ఉండేదని గతంలో కనేరియా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. భార్య, పిల్లలు, తల్లితో కలిసి కనేరియా భారత్ కు అకస్మాత్తుగా వెళ్లడాన్ని పర్యటనగా కాదని, వలస వెళ్లినట్టుగా ఉందని పాక్ లో వార్తలు వెలువడుతున్నాయి. కాగా, కనేరియా ప్రస్తుతం కేరళలోని కొచ్చిలో ఉంటున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News