: వచ్చే ఏడాది జూన్ 4 న తలపడనున్న భారత్-పాక్ క్రికెట్ జట్లు
2017 ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసింది. వచ్చే ఏడాది జూన్ ఒకటిన ప్రారంభమై, 18 రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీలో తొలి మ్యాచ్ బంగ్లాదేశ్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరగనుంది. కాగా, ఈ షెడ్యూల్ ప్రకారం టీమిండియా, పాకిస్ధాన్ జట్లు ఒకే గ్రూప్ లో ఉన్నాయి. దీంతో ఈ రెండు జట్ల మధ్య వచ్చే ఏడాది జూన్ 4న పోరాటం జరగనుంది. కాగా, ఇంగ్లండ్ లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో 8 జట్లు పాల్గొంటాయి. మొత్తం 15 మ్యాచ్ లు జరగనున్న టోర్నీలో ఇంగ్లండ్, వేల్స్ లోని మూడు స్టేడియంలను సిద్ధం చేయనున్నారు. ఈ టోర్నీలో ఇంగ్లండ్, టీమిండియా, కివీస్, ఆసీస్, ప్రోటీస్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు పాల్గొంటాయి.