: నైజీరియన్లు చాలా చికాకుపెడుతున్నారు: గోవా సీఎం


నైజీరియన్ల వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, వారి ప్రవర్తన చాలా చికాకుపెడుతోందని గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ మండిపడ్డారు. పనాజీలో ఆయన మాట్లాడుతూ, నైజీరియన్ల ప్రవర్తనపై స్థానికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని అన్నారు. గోవాలో నివసించే విదేశీయుల ప్రవర్తన, జీవన విధానం స్థానికులను ఇబ్బంది పెట్టేలా ఉందని ఆయన తెలిపారు. గోవా పర్యాటకమంత్రి దిలీప్ పర్సేకర్ ఇటీవల మాట్లాడుతూ, నైజీరియన్ల నివాసంపై కఠిన చట్టం తేవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎక్కువ కాలం భారత్ లో అక్రమంగా ఉండేందుకు వీళ్లు నేరాలు చేస్తున్నారని, ఆ తరువాత విచారణ పేరిట దేశంలోనే ఉంటున్నారని ఆయన తెలిపారు. వీరి ఆటలకు అడ్డుకట్టవేయాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News