: బాలీవుడ్ సీనియర్ కమెడియన్ రజాక్ ఖాన్ మృతి
బాలీవుడ్ లో 90కిపైగా సినిమాల్లో నటించి మంచి హాస్యనటుడిగా పేరుపొందిన రజాక్ ఖాన్ ఇకలేరు. ఈరోజు తెల్లవారు జామున ఆయనకు గుండె పోటు రావడంతో బాంద్రాలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందారని వైద్యులు వెల్లడించారు. విదేశాల్లో ఉన్న రజాక్ ఖాన్ కుమారుడు అజాద్ ఖాన్ కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. రేపు సాయంత్రం నాలుగు గంటలకు ముంబయిలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రజాక్ ఖాన్ మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.