: వాయు కాలుష్యంతో అధిక రక్తపోటు ముప్పు.. పరిశోధకుల హెచ్చరిక
వాయు కాలుష్యం జరగడం ద్వారా వాతావరణంలో వెలువడే రసాయనాలతో అధిక రక్తపోటు (బీపీ) ముప్పు కలుగుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వాయు కాలుష్యం అధికంగా జరిగే ప్రాంతాల్లో నివసిస్తోన్న వారు అధిక రక్తపోటును ఎదుర్కుంటున్నారని చైనాలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు వెల్లడించారు. రక్తపోటుకి వాతావరణంలో వెలువడే సల్పర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ కారణమవుతాయని, శిలాజ ఇంధనాలతో వస్తువుల దహన క్రియ జరిగినప్పుడు, మరికొన్ని కారకాల వల్ల వీటితో కూడిన వాయువులు వెలువడతాయని పరిశోధకులు చెబుతున్నారు. అధిక రక్తపోటుతో హృద్రోగాలు వచ్చే ముప్పు ఉంటుందని పేర్కొన్నారు. వాయు కాలుష్యానికి దూరంగా ప్రజలు జీవించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.