: రామ‌భ‌క్త హ‌నుమాన్ కి ల‌క్ష గారెల నివేదన!


రామ‌భ‌క్త హ‌నుమాన్‌కి తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని బండివారి అగ్రహారంలో గారెల నివేద‌న పెట్టారు. ఏకంగా ల‌క్ష‌ గారెల‌ను స్వామి వారికి నివేదన‌గా స‌మ‌ర్పించారు. హ‌నుమ‌జ్జ‌యంతి వేడుక‌లు, ఆపై నిన్న మంగళవారం కావడంతో ఈ సందర్భంగా నిన్న ఉద‌యం నుంచి అక్క‌డి దాసాంజనేయ‌ స్వామివారి స‌న్నిధిలో భ‌క్తుల తాకిడి ఎక్కువైంది. మ‌రోవైపు భ‌క్తులు భారీ సంఖ్య‌లో ఘుమ‌ఘుమ‌లాడే గారెల‌ను వండడంలో బిజీ బిజీగా మారారు. ఏకంగా ల‌క్ష‌ గారెల‌ను స్వామివారికి స‌మ‌ర్పించి త‌మ భ‌క్తిని చాటుకున్నారు. స్వామివారికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.

  • Loading...

More Telugu News