: రేపిస్టు బారి నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు 'డెత్ ప్లాన్' వేసిన ఎనిమిదేళ్ల బాలిక


ఢిల్లీలో కిడ్నాప్ అయి, అత్యాచారానికి గురైన ఎనిమిదేళ్ల బాలిక, ఆ కిరాతకుడి బారి నుంచి తన ప్రాణాలను దక్కించుకునేందుకు చనిపోయినట్టు నాటకమాడింది. బాధితురాలి తండ్రి చెప్పిన వివరాల ప్రకారం, కిరారీ ప్రాంతంలో ఆరుబయట నిద్రిస్తున్న బాలికను ఓ వ్యక్తి అర్ధరాత్రి సమయంలో ఎత్తుకెళ్లాడు. పాపకు మెలకువ వచ్చి చూసేసరికి తన ఇంట్లో కాకుండా, వేరే కొత్త ప్రదేశంలో ఉన్నట్టు గమనించింది. కేకలు పెట్టబోతే, అతను నోటిని గట్టిగా మూసేశాడు. ఆ తర్వాత ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. జరుగుతున్నదేమిటో తెలియని ఆ చిన్నారి, అతను తనని చంపేస్తున్నాడని అనుకుని, చనిపోయినట్టు నటించింది. అనంతరం నిందితుడు గిల్లి చూసినా కదలక మెదలక పడిపోయింది. ఈ 'డెత్ ప్లాన్' పనిచేసింది. నిందితుడు భయపడ్డాడు. బాలికను కుదిపిచూశాడు. అయినా ఆమె కదల్లేదు. అతను కాస్త దూరం వెళ్లగానే లేచి ఇంటివైపు పరుగుతీయడం ప్రారంభించింది. బాలికను వెంబడించాలని చూసిన ఆ కామాంధుడు రోడ్డుపై రాయి తగిలి కిందపడ్డాడు. ఇంటికి వచ్చిన తరువాత తనకు పొత్తి కడుపులో నొప్పిగా ఉందని బాలిక చెప్పడం, దుస్తులకు రక్తపు మరకలు అంటుకుని ఉండటంతో హడలిపోయిన తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. బాలికను కిడ్నాప్ చేసిన సమయంలో ఓ సీసీటీవీ ఫుటేజ్ కి చిక్కాడని, అయితే, రాత్రి పూట కావడంతో అతనెవరో గుర్తు తెలియడం లేదని వివరించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి నిలకడగా ఉంది.

  • Loading...

More Telugu News