: మరో బాదుడుకు కేంద్రం శ్రీకారం!... నేటి నుంచే అమల్లోకి 'కృషి కల్యాణ్' సెస్!
నల్లధనాన్ని దేశానికి రప్పిస్తామన్న ప్రధాన హామీతో అధికార పగ్గాలు చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... ఆ విషయాన్ని పక్కనపెట్టేసి ప్రజలపై పన్నుల మీద పన్నులేస్తూ నడ్డి విరుస్తున్నారు. ఇప్పటికే స్వచ్ఛ భారత్ సెస్ పేరిట సరికొత్త పన్నును వసూలు చేస్తున్న కేంద్రం... నేటి నుంచి కృషి కల్యాణ్ సెస్ పేరిట మరో అరశాతం పన్నును వసూలు చేయనుంది. వెరసి సేవలపై ప్రభుత్వం పిండుతున్న పన్ను శాతం 15 శాతానికి పెరుగుతోంది. వ్యవసాయం, అన్నదాతల సంక్షేమం పేరిట నేటి నుంచి కొత్తగా అమల్లోకి రానున్న కృషి కల్యాణ్ సెస్ కారణంగా ఫోన్ బిల్లులు, హోటల్ బిల్లులు, సినిమా టికెట్లు, ఆరోగ్య సేవలు, బ్యాంకింగ్ లావాదేవీలు, రైలు, విమాన టికెట్లు మరింత భారం కానున్నాయి.