: గుంటూరులో ఓ పక్క కీలక సమావేశం.. మరోపక్క ల్యాప్ టాప్ లో పేకాటాడుకున్న ఉద్యోగి!
గుంటూరులోని జిల్లా పరిషత్ హాల్లో సర్వశిక్షా అభియాన్ పై ఈరోజు రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 13 జిల్లాలకు చెందిన అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. ఇదంతా బాగానే ఉంది. కానీ, సమావేశం మొదలైనప్పటి నుంచి ముగిసే దాకా గుంటూరు జెడ్పీ ఉద్యోగి చేసిన పనే బాగుండలేదు. సమావేశం జరుగుతున్నంత సేపు సదరు ఉద్యోగి ల్యాప్ టాప్ లో పేకాటాడుకుంటూ ఎంజాయ్ చేశాడు. ఇదంతా ఎవరు చూస్తారులే! అనుకున్న అతనికి చేదు అనుభవం ఎదురైంది. ఈ పేకాట తతంగమంతా ఒక ఛానెల్ దృష్టిలో పడడంతో, ఈ విషయం అధికారులకు తెలిసినట్లు సమాచారం.