: కోచ్ పదవికి రవిశాస్త్రి, సంజయ్ బంగర్, భరత్ అరుణ్, ఆర్.శ్రీధర్ దరఖాస్తులు?
టీమిండియా కోచ్ పదవికి మాజీ ఆటగాళ్లు రవిశాస్త్రి, సంజయ్ బంగర్, భరత్ అరుణ్, ఆర్.శ్రీధర్ లు ఆసక్తిగా ఉన్నారని బీసీసీఐ వెల్లడించింది. గతంలో టీమిండియా డైరెక్టర్ గా రవిశాస్త్రి పనిచేస్తున్న సమయంలో సంజయ్ బంగర్ బ్యాటింగ్ కోచ్ గా, భరత్ అరుణ్ బౌలింగ్ కోచ్ గా, ఆర్.శ్రీధర్ ఫీల్డింగ్ కోచ్ గా పని చేశారు. వీరంతా మరోసారి కోచ్ పదవికి బరిలో ఉన్నారని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. టీమిండియా కోచ్ పదవి నోటిఫికేషన్ ఇంకా వెలువడలేదని, నోటిఫికేషన్ వెలువడగానే వీరు దరఖాస్తులు చేస్తారని తెలుస్తోంది. కాగా, కోచ్ ఎంపికలో కెప్టెన్ మాటకు కూడా ప్రాధాన్యం ఉండడంతో రవిశాస్త్రి వ్యూహం ప్రకారమే కోహ్లీని పొగడుతున్నట్టు తెలుస్తోంది.