: ‘నో కాస్ట్ ఈఎంఐ’ పేరుతో ఫ్లిప్ కార్టు బంపర్ ఆఫర్


‘నో కాస్ట్ ఈఎంఐ’ పేరుతో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్టు తన వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రతి నెలా వాయిదా పద్ధతుల్లో వస్తువులను కొనుగోలు చేసేవారు అదనంగా చెల్లింపులు చెల్లించే అవసరం లేకుండా ఈ కొత్త ఆప్షన్ ను తీసుకొచ్చింది. దీని ప్రకారం డౌన్ పేమెంట్, ప్రాసెసింగ్ ఫీజు, వడ్డీరేట్లు లాంటి చెల్లింపులు ఇకపై ఉండవని ఒక ప్రకటనలో పేర్కొంది. ‘నో కాస్ట్ ఈఎంఐ’ ఆప్షన్ ను ఫ్లిప్ కార్టు ఆన్ లైన్ వినియోగదారులందరికీ అందుబాటులోకి తెచ్చినట్టు సంస్థ కు చెందిన డిజిటల్ అండ్ కస్టమర్ ఫైనాన్షియల్ సర్వీసుల అధినేత మయాంక్ జైన్ తెలిపారు. భారీగా కొనుగోళ్లు జరిపే, ఆన్ లైన్ షాపింగ్ చేసే వినియోగదారులు ఈ కొత్త ఆప్షన్ ను శుభవార్తగా భావిస్తారని అన్నారు.

  • Loading...

More Telugu News