: విలువలను కాపాడాలని ముఖ్యమంత్రి మమ్మల్ని ఆపారు: భూమా


రాజ్యసభకు పంపేందుకు నాలుగో అభ్యర్థిని పోటీకి పెట్టండి అని తామంతా కోరితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారించారని టీడీపీ నేత భూమా నాగిరెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాజకీయాల్లో విలువలు పెంపొందించాలని అన్నారు. అందుకే పోటీకి నిలబెట్టలేదని ఆయన తెలిపారు. రాజ్యసభకు నాలుగో అభ్యర్థిని పోటీలో నిలబెట్టాలని డిమాండ్ చేస్తూ ఏడు గంటలపాటు ముఖ్యమంత్రికి నచ్చజెప్పే ప్రయత్నం చేశామని ఆయన తెలిపారు. అయితే ఆయన అందుకు ససేమిరా అన్నారని ఆయన చెప్పారు. కేసుల నుంచి బయటపడేందుకు సొంత వ్యక్తులను రాజ్యసభకు పంపడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్సీపీలో ప్రజాప్రతినిధులు మాట్లాడే స్వేఛ్ఛలేదని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News