: తెలంగాణలో రాష్ట్రావతరణ ఉత్సవాలకి ఏర్పాట్లు.. ఏపీలో నవనిర్మాణ దీక్షకి చంద్రబాబు ఆదేశాలు
జూన్ 2.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు. అంటే మరో రెండు రోజుల్లో తెలంగాణకు రెండు సంవత్సరాలు నిండబోతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మంత్రులు, అధికారులు ఆ పనుల్లోనే తలమునకలయ్యారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ జూన్ 2న నవనిర్మాణ దీక్షకు దిగనుంది. ఈ అంశంపై విజయవాడలో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని జిల్లాల అధికారులు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ 2న ఉదయం 11 గంటలకు రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరూ నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. జూన్ 3 నుంచి 7 వరకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. అనంతరం జూన్ 8న నిర్వహించే మహా సంకల్ప యాత్ర చేయాలని నిర్ణయించారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని నవనిర్మాణ దీక్షతో కేంద్రం ముందుంచాలని భావిస్తున్నారు.