: మహానాడులో ఎమ్మెల్యే డబ్బు కాజేసిన దొంగలు దొరికారు!


తెలుగుదేశం మహానాడు వేడుకలు జరుగుతున్న వేళ, బద్వేలు ఎమ్మెల్యే జయరాములు నుంచి రూ. 95 వేలు కాజేసిన దొంగలు దొరికిపోయారు. తన డబ్బు పోయిందని జయరాములు ఫిర్యాదు చేయగా, దాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు దొంగల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీరు మహానాడు ప్రాంగణం నుంచి పార్కింగ్ ఏరియాలు, మైదానం వెలుపల ఏర్పాటు చేసిన మొత్తం సీసీటీవీ కెమెరాలన్నింటినీ నిశితంగా పరిశీలించారు. జయరాములు వెనుక కదలాడుతున్న ఇద్దరిని గుర్తించారు. ఆపై వారి కదలికలన్నీ గమనించి, స్థానిక దొంగలేనని తేల్చారు. కొద్దిసేపటి క్రితం వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఎమ్మెల్యే నుంచి దొంగిలించిన సొమ్మును రికవరీ చేశారు. కేసు నమోదు చేశామని, వీరిని రిమాండ్ చేయనున్నామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News