: మా నాన్న ఓపెన్ హార్ట్ సర్జరీ విజయవంతం: ట్విట్టర్‌లో ప్రకటించిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు


పాకిస్థాన్ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రిఫ్‌కి ఈరోజు లండ‌న్‌లో నిర్వ‌హించిన ఓపెన్ హార్ట్ స‌ర్జ‌రీ విజ‌య‌వంత‌మ‌యింద‌ని ఆయన కూతురు మ‌ర్యాన్ న‌వాజ్ ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. మెడిక‌ల్ చెక‌ప్ కోసం కొన్ని రోజుల క్రితం లండ‌న్ వెళ్లిన న‌వాజ్ ష‌రిఫ్‌కి ప‌లు టెస్టులు నిర్వ‌హించిన త‌రువాత డాక్ట‌ర్లు గుండె ఆప‌రేష‌న్ చేయాల‌ని చెప్పారు. దీంతో ఆయ‌న కొన్ని రోజులుగా అక్క‌డే ఉన్నారు. న‌వాజ్ ష‌రిఫ్ పూర్తి ఆరోగ్యంతో దేశానికి తిరిగి రావాల‌ని పార్థ‌న‌లు చెయ్యండంటూ ఆయ‌న కూతురు మ‌ర్యాన్ న‌వాజ్ ట్విట్ట‌ర్ ద్వారా ప్రతీరోజు ప్ర‌జ‌ల‌ను కోరుతున్నారు. ప్రజల ప్రార్థ‌న‌లు ఫ‌లిస్తున్నాయ‌ని త‌న‌ తండ్రికి ఆప‌రేష‌న్ విజ‌య‌వంతంగా ముగుస్తోంద‌ని మ‌ర్యాన్ న‌వాజ్ లండన్ నుంచి తన తండ్రి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా పేర్కొంటున్నారు. కొద్ది సేప‌టి క్రితం తన తండ్రి ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని, మరికాసేపట్లో నవాజ్ షరిష్ ను ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసీయూలోకి షిఫ్ట్ చేయనున్నారని ఆమె పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News