: ట్వీట్లు ఎక్కువగా చేసే వారిలో ఈటింగ్ డిజార్డర్!
ట్వీట్లు ఎక్కువగా చేసే వారు ఈటింగ్ డిజార్డర్ బారిన పడతారని ఒక తాజా అధ్యయనం ద్వారా తెలిసింది. పలు సామాజిక మాధ్యమాలను ఉపయోగించే వారికి, ఈటింగ్ డిజార్డర్ కు సంబంధముందన్న విషయాన్ని ఈ అధ్యయనం ద్వారా కనుగొన్నారు. అంతేకాకుండా, మొబైల్ ఫోన్ అప్లికేషన్స్ ఎక్కువగా వినియోగించడం కూడా ఒక వ్యసనమైపోతుందని తేలింది. సాంప్రదాయక బ్లాగ్స్ చూసేవారిలో మాత్రం అనారోగ్యకరమైన రీతిలో ఆహారం తీసుకోవడం జరగదని వారి పరిశోధనలో వెల్లడైంది. కాబట్టి, తక్కువగా ట్వీట్ చేస్తే, ఎక్కువగా ఆరోగ్యం పొందవచ్చని ఆ అధ్యయనం ద్వారా సూచించారు.