: ఫెమినిజంకు కొత్త అర్థం చెబుతున్న బాలీవుడ్ నటి


బాలీవుడ్ లో ఫెమినిస్టు (స్త్రీవాది)గా ముద్రపడిన కల్కీ కోచ్లిన్ అసలు ఫెమినిజం అంటే ఏంటన్న దానిని తనదైన శైలిలో వివరించేందుకు ఓ వీడియో తీసే ఆలోచనలో ఉంది. తాను ఫెమినిస్టునేనని కల్కీ స్పష్టం చేసింది. ఫెమినిస్టు అంటే కేవలం మహిళల తరపున మాట్లాడేవారు మాత్రమే కాదని, సమానత్వం కోసం పోరాడే ప్రతిఒక్కరూ ఫెమినిస్టులేనని ఆమె స్పష్టం చేసింది. మాతృస్వామ్య వ్యవస్థలో మనమంతా ఉండి ఉంటే తాను పురుషుల ప్రయోజనాల కోసం పోరాడి ఉండేదానినని తెలిపింది. ఇక్కడ ఇజం అంటే సమానత్వమని అంతా గుర్తించాలని ఆమె కోరుతోంది. సమానత్వం కోసం పోరాడేవారు ఫెమినిస్టులు కాదంటే వారంతా చెడ్డవారేనని కల్కీ స్పష్టం చేసింది. ఫెమినిజంపై అవగాహన కల్పించేందుకు ఓ వీడియో రూపొందించాలని అనుకుంటున్నానని ఆమె తెలిపింది.

  • Loading...

More Telugu News