: కేన్స్ వేడుకలో ఐశ్వర్యరాయ్ పర్పుల్‌ కలర్‌ లిప్‌స్టిక్ కామెంట్లపై స్పందించిన అమితాబ్


కేన్స్ వేడుకలో ఐశ్వర్యరాయ్ పర్పుల్‌ కలర్‌ లిప్‌స్టిక్‌ వేసుకొని అభిమానుల దృష్టిని త‌న వైపుకి తిప్పుకున్న విష‌యం తెలిసిందే. అయితే ఐష్‌ పర్పుల్‌ కలర్‌ లిప్‌స్టిక్‌పై త‌న అభిమానులు, నెటిజ‌న్ల నుంచి మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది. త‌న లిప్‌స్టిక్ క‌ల‌ర్ బాగుంద‌ని కొంద‌రూ, బాగాలేద‌ని మ‌రికొంద‌రూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌లు కామెంట్లు చేసుకున్నారు. పలువురు ఈ అంశంపై సెటైర్లు కూడా వేశారు. అయితే, తాజాగా అమితాబ్ బచ్చన్ ఈ విషయంపై స్పందించారు. తన కోడలు ఐశ్వర్యరాయ్ బచ్చన్ పై నెటిజన్లు చేసిన ట్వీట్లను తాను చూడలేదని అన్నారు. అయినా నెటిజన్లు విమర్శలు చేయడంలో తప్పేంలేదని, కామెంట్లు చేయడం ఇప్పుడు ఆన్ లైన్ లో ఓ ట్రెండ్ అని ఆయ‌న అన్నారు. సోష‌ల్ మీడియా నెటిజ‌న్లు అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేసుకునే అవకాశం ఇస్తుంద‌ని అమితాబ్ అన్నారు. ఇత‌రులు త‌మ గురించి ఏమ‌నుకుంటున్నారో తెలుసుకునే అవ‌కాశం గ‌తంలో ఉండేది కాదని, ఇప్పుడు సోష‌ల్ మీడియా పుణ్యమాని ఇత‌రులు మ‌న గురించి ఏమ‌నుకుంటున్నారో ఇట్టే తెలిసిపోతుందని ఆయ‌న అన్నారు. ఈరోజు ఒక అంశంపై కామెంట్ చేసి, రేపు వేరే అంశాన్ని సోష‌ల్ మీడియాలో లేవ‌నెత్త‌డం చూస్తూనే ఉన్నామ‌ని ఆయ‌న చెప్పారు. ‘సోష‌ల్ మీడియా ద్వారా అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసే అవ‌కాశం ప్ర‌తీ ఒక్క‌రికీ ఉంది. దానిలో ఎటువంటి త‌ప్పూ లేద’ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News