: పిచ్చి ప్రేలాపనలు వద్దు... ధైర్యముంటే విచారణ జరిపించండి: బీజేపీపై నిప్పులు చెరిగిన సోనియా


తన అల్లుడు రాబర్ట్ వాద్రా, ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారీల మధ్య ఉన్న సంబంధాలు, లండన్ లో మ్యాన్షన్ తదితర ఆరోపణలపై అధికారంలో ఉన్న బీజేపీకి ధైర్యముంటే విచారణ జరిపించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సవాల్ విసిరారు. రాయ్ బరేలీ పర్యటనలో ఉన్న ఆమె, ఈ ఉదయం మీడియాతో మాట్లాడుతూ, "ప్రతి రోజూ ఏదో ఒక ఆరోపణ చేస్తున్నారు. ఇదో అలవాటైపోయింది. ఏవైనా ఆధారాలుంటే, విచారణ జరిపి ఆరోపణలను రుజువు చేసి చూపండి. పిచ్చి మాటలు ఎందుకు?" అని ఆమె అన్నారు. ఇండియాలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలన్న అజెండాతో సాగుతున్న బీజేపీ ఈ తరహా కుట్రలు చేస్తోందని ఆమె ఆరోపించారు. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదని, మోదీ కేవలం ప్రధానమంత్రే తప్ప, షహన్ షా (రాజు) కాదని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

  • Loading...

More Telugu News