: మరో బాంబు పేల్చిన సుబ్రహ్మణ్యస్వామి... బ్రిటన్ పౌరసత్వం కోసం వాద్రా భారీ మొత్తం చెల్లించారట!
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా కుటుంబంపై సంచలన ఆరోపణలు గుప్పిస్తున్న బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మరో బాంబు పేల్చారు. సోనియా గాంధీ అల్లుడు, వివాదాస్పద వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా... బ్రిటన్ పౌరసత్వం కోసం భారీ ఎత్తున నిధులు వెచ్చించారని ఆయన ఆరోపించారు. త్వరితగతిన బ్రిటన్ పౌరసత్వం పొందేందుకే వాద్రా ఈ నిధులు వెచ్చించారని సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లేఖ కూడా రాశారు, పౌరసత్వం రాగానే బ్రిటన్ చెక్కేసేందుకు వాద్రా సన్నాహాలు చేసుకుంటున్నారని, ఈ నేపథ్యంలో వాద్రాపై నమోదైన కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని కోరారు. ఈ వ్యవహారంపై జాతీయ మీడియా సంస్థ ‘ఇండియా టుడే’ నేడు ఓ సంచలన కథనాన్ని ప్రసారం చేసింది.