: ముందు సుజనా, ఆపై క్యూ కట్టిన సురేష్, డీఎస్, కెప్టెన్... మరోసారి విజయసాయిరెడ్డి!


తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాల ఎన్నిక కోసం నామినేషన్ల ప్రక్రియ కోలాహలంగా ముగిసింది. మధ్యాహ్నం తరువాత ముహూర్తం బాగాలేదన్న కారణంగా 12 గంటలలోపే అందరూ నామినేషన్లు వేసేశారు. పండితులతో తాను పెట్టించుకున్న ముహూర్తానికి నామినేషన్ వేసేయాలని భావించిన సుజనా చౌదరి మొట్టమొదట తన అభ్యర్థిత్వ పత్రాలను అసెంబ్లీలో అందించారు. ఆపై బీజేపీ నేత, రైల్వే మంత్రి సురేష్ ప్రభు నామినేషన్ వేశారు. ఆ తరువాత పలువురు తెలంగాణ మంత్రులతో కలసి వచ్చిన డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావులు నామినేషన్లను అందించారు. తెలుగుదేశం రెండో అభ్యర్థి టీజీ వెంకటేష్ నామినేషన్ మాత్రం ఇంకా పడలేదు. ఆయన కాసేపట్లో అసెంబ్లీకి రానున్నారని తెలుస్తోంది. కాగా, వైకాపా తరఫున బరిలోకి దిగనున్న విజయసాయిరెడ్డి మరో సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు మధ్యాహ్నం తరువాత అసెంబ్లీకి రానున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News