: రూ. 4 లక్షల కన్నా తక్కువ ధరలో లభించే ఎంట్రీ లెవల్ టాప్ హ్యాచ్ బ్యాక్ కార్లు... ఇవిగో!


అంతర్జాతీయ మార్కెట్ తో పోలిస్తే భారత సగటు కారు కొనుగోలుదారు ఎంతో వైవిధ్యం. ఇండియాలో కార్లు కొనాలని భావించేవారు సౌకర్యంతో పాటు, అంతకుమించి మరింత మైలేజీని కోరుకుంటారన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో కారులో అన్ని సౌకర్యాలూ ఉండాలని కూడా భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో రూ. 4 లక్షల కన్నా తక్కువ ధరలో దాదాపు అన్ని సౌకర్యాలతో అందుబాటులో ఉన్న ఎంట్రీ లెవల్ టాప్ హ్యాచ్ బ్యాక్ కార్ల వివరాలివి. రెనాల్ట్ క్విడ్: ధర రూ. 2.62 లక్షల నుంచి రూ. 3.67 లక్షలు రెనాల్ట్ సంస్థ ఇటీవల భారత మార్కెట్లోకి తెచ్చిన కారు ఇది. రెనాల్ట్ డస్టర్ కు బేబీ వర్షన్ గా నిపుణులు అభివర్ణించిన ఈ కారు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అధిక గ్రౌండ్ క్లియరెన్స్, ఎస్యూవీ స్టైలింగ్ దీని ప్రత్యేకత. రేడియో, సీడీ, యూఎస్బీ, బ్లూటూత్ సౌకర్యాలతో టచ్ స్క్రీన్ ఇన్ఫోటెయిన్ మెంట్, నాలుగు స్పీకర్లు, క్రోమ్ ఏసీ వెంట్స్ తో లభించే కారు 799 సీసీ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ తో 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో లభిస్తుంది. మారుతి సుజుకి ఆల్టో 800 ఫేస్ లిఫ్ట్ : ధర రూ. 2.45 లక్షల నుంచి రూ.3.70 లక్షలు దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా చరిత్రలో నిలిచిన ఆల్టో 800కు కొత్త వర్షన్. సరికొత్త హెడ్ ల్యాంప్స్, మరింత బలమైన బంపర్, మారిన రేడియేటర్ గ్రిల్, ఫాగ్ ల్యాంప్స్ అమర్చుకునే సదుపాయం ఉన్నాయి. పెద్దగా కొత్త ఫీచర్లు జోడించకపోయినా, ఆల్టో ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్ బ్యాక్. టాటా నానో జెన్ ఎక్స్ : ధర రూ. 2.07 లక్షల నుంచి రూ. 3.04 లక్షలు లక్ష రూపాయల కారుగా ప్రపంచ ఆటో ఇండస్ట్రీని తనవైపునకు తిప్పుకున్న నానోలో లేటెస్ట్ వర్షన్ ఇది. తొలి నానో మోడళ్లతో పోలిస్తే దీనికి ఎన్నో మార్పులు కనిపిస్తాయి. కాళ్లకు మరింత స్థలం, నలుగురు సులువుగా ప్రయాణించే వీలును కల్పించే కారులో ఫ్యాబ్రిక్ సీట్లు, పవర్ స్టీరింగ్, ఫ్రంట్ పవర్ విండోస్, మెరుగైన ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ అదనపు ఆకర్షణలు. (కార్ల ధరలన్నీ ఎక్స్ షోరూం, న్యూఢిల్లీ)

  • Loading...

More Telugu News