: సిద్ధేశ్వరం వద్ద ఉద్రిక్తత ఎఫెక్ట్!... సొంత గ్రామంలో బుడ్డా శేషారెడ్డి హౌజ్ అరెస్ట్!


కర్నూలు జిల్లా ఆత్మకూరు పరిధిలో సిద్ధేశ్వరం వద్ద అలుగుతో రాయలసీమ సాగునీటి కష్టాలు తీరతాయన్న రైతుల వాదనకు ప్రభుత్వం నుంచి మద్దతు లభించలేదు. దీంతో సిద్ధేశ్వరం అలుగుకు శంకుస్థాపన చేస్తామంటూ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఆత్మకూరు పరిసర ప్రాంతాలకు చేరుకుంటున్న రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. సిద్ధేశ్వరం సహా, ఆత్మకూరు, కొత్తపల్లి, సంగమేశ్వరం తదితర ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ నిషేధాజ్ఞలను అమల్లోకి తెచ్చారు. రైతులను అడ్డుకునే క్రమంలో పలు రాజకీయ పార్టీలకు చెందన నేతలను కూడా పోలీసులు టార్గెట్ చేశారు. ఈ క్రమంలో ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి సోదరుడు బుడ్డా శేషారెడ్డిని ఆయన సొంతూరైన వేల్పనూరులో పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News