: రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలదు!... వెంకయ్య ఎక్కడికెళ్లినా ‘హోదా’ వెంటాడుతుందన్న సీపీఐ నారాయణ
రాజ్యసభ సభ్యత్వం విషయంలో తన సొంత రాష్ట్రం ఏపీలో అవకాశం ఉండి కూడా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు రాజస్థాన్ కు వెళ్లిపోయిన వైనంపై సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ నిన్న ఆసక్తికర కామెంట్లు చేశారు. నిన్న ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... అసలు వెంకయ్య ఏపీ నుంచి కాకుండా రాజస్థాన్ కు వెళ్లిపోయిన కారణాన్ని కూడా వివరించారు. ‘‘శనిలా వెంటాడుతున్న ఏపీకి ప్రత్యేక హోదా వ్యవహారం నుంచి తప్పించుకునేందుకే వెంకయ్య రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికవుతున్నారు. రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలదన్నట్లు... వెంకయ్య ఎక్కడికెళ్లినా ఆయనను ప్రత్యేక హోదా వెంటాడుతూనే ఉంటుంది’’ అని నారాయణ వ్యాఖ్యానించారు.