: రాజ్యసభ నామినేషన్ల హోరు!... కాసేపట్లో అసెంబ్లీకి టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులు!


రాజ్యసభలో ఖాళీ కానున్న స్థానాలకు జరగనున్న ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లకు నేటితో గడువు ముగియనుంది. ఇప్పటిదాకా ఏపీ కోటాలో తనకు దక్కనున్న సింగిల్ సీటుకు వైసీపీ అభ్యర్థిగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సాయిరెడ్డి మినహా ఇప్పటిదాకా ఏ ఒక్క నామినేషన్ దాఖలు కాలేదు. అయితే నామినేషన్లకు చివరి రోజైన నేడు అన్ని స్థానాలకు నామినేషన్లు దాఖలు కానున్నాయి. దీంతో నేడు అసెంబ్లీ ప్రాంగణంలో ఆయా పార్టీ నేతల కోలాహలం నెలకొననుంది. టీడీపీకి దక్కనున్న మూడు సీట్లలో ఓ సీటును ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు బీజేపీకి కేటాయించారు. మిగిలిన రెండు సీట్లకు కేంద్ర మంత్రి సుజనా చౌదరి, పార్టీ నేత టీజీ వెంకటేశ్ లను ఎంపిక చేశారు. వీరిద్దరితో పాటు బీజేపీకి కేటాయించిన సీటుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు నేడు నామినేషన్ వేయనున్నారు. ఇక తెలంగాణ కోటాలో తనకు దక్కనున్న రెండు సీట్లకు ధర్మపురి శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతారావులను ఎంపిక చేసింది. వీరిద్దరు కూడా నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

  • Loading...

More Telugu News