: రాష్ట్రానికి రావాల్సినవి తీసుకొస్తాం: టీజీ వెంకటేష్
ప్రజలకు మరింత సమర్ధవంతమైన సేవలందించడంలో భాగంగా సుజనా చౌదరితో పాటు తనను కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజ్యసభకు పంపించాలని నిర్ణయం తీసుకున్నారని టీజీ వెంకటేష్ తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటాను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. ఇప్పటికే సుజనా చౌదరి రాష్ట్రానికి రావాల్సిన వాటాల గురించి కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నారని ఆయన చెప్పారు. ఆయన సారధ్యంలో రాష్ట్రానికి రావాల్సిన సౌకర్యాలపై చంద్రబాబు ఆదేశాలు, ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తానని ఆయన చెప్పారు.