: రాజ్యసభ అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటించిన బీజేపీ


రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ ప్రకటించింది. పలు రాష్ట్రాల నుంచి బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల పేర్లను ఎన్నికల కమిటీ కార్యదర్శి కేంద్ర మంత్రి జేపీ నడ్డా విడుదల చేశారు. వాటి వివరాలు.. ఆంధ్రప్రదేశ్- సురేశ్ ప్రభు, మధ్యప్రదేశ్- ఎంజే అక్బర్, మహారాష్ట్ర- శశ్ త్ర బుద్ధే, డాక్టర్ వికాస్ మహాత్మే, ఉత్తరప్రదేశ్- శివప్రతాప్ శుక్లా, జార్ఖండ్- మహేశ్ పొద్దార్. కాగా, మొత్తం 12 మంది అభ్యర్థులతో నిన్న మొదటి జాబితాను బీజేపీ ప్రకటించింది. అందులో ఏపీకి చెందిన కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు రాజస్థాన్ నుంచి, నిర్మలాసీతారామన్ కర్ణాటక నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News