: ఆ సీన్ లో రాయిలా మారిపోయాను...రణదీప్ సహకరించాడు: కాజల్


బాలీవుడ్ లో 'దో లఫ్జోంకీ కహానీ' సినిమా పోస్టర్ పెద్ద చర్చను లేవదీసింది. బాలీవుడ్ 'సింగం', 'స్పెషల్ 26', వంటి సినిమాల్లో సంప్రదాయ పాత్రల్లో నటించిన కాజల్ అగర్వాల్ తాజాగా నటించిన 'దో లఫ్జోంకీ కహానీ' సినిమాలో సహనటుడు రణ్ దీప్ హుడా పెదాలను గాఢంగా చుంబించే పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్ ను చూసినవారు కాజలేనా? అని ఆశ్చర్యపోతున్నారు. దీంతో ఈ పోస్టర్ గురించి మీడియాతో మాట్లాడిన కాజల్... ఆ సీన్ చేసేటప్పుడు రాయిలా బిగుసుకుపోయానని చెప్పింది. అయితే సహనటుడు రణ్ దీప్ హుడా చాలా సహకరించాడని తెలిపింది. తాను ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఉండేలా సహకరించాడని చెప్పింది. ఈ సీన్ కి ముందు తామిద్దరం చాలా మాట్లాడుకున్నామని, దాంతో భయాలన్నీ తొలగిపోయాయని కాజల్ చెప్పింది. దక్షిణాదిలో ఇలాంటి సీన్లు చేయలేదని, ఈ ముద్దు స్క్రిప్టులో భాగం కావడంతో పూర్తిగా అర్థం చేసుకున్నానని కాజల్ చెప్పింది.

  • Loading...

More Telugu News