: టీడీపీని విమర్శించడం లేదు, వాస్తవాలు చెబుతున్నాం: బీజేపీ నేత సోము వీర్రాజు
ఏపీ బీజేపీ నేతలు టీడీపీని విమర్శించడం లేదని బీజేపీ నేత సోము వీర్రాజు తెలిపారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ, తమ అంతరంగాన్ని టీడీపీ నేతలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అన్నారు. తాము ఎవరినీ విమర్శించడం లేదని, ప్రజలకు వాస్తవాలు చెబుతున్నామని ఆయన చెప్పారు. అవాస్తవాలతో ప్రజలను మభ్యపెట్టాలని భావించడం లేదని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లో ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నదే తమ అభిమతమని ఆయన చెప్పారు. ఏపీని అన్నిరంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.