: ‘జనసేన’ విధానాలు స్పష్టమైన తర్వాత దాని గురించి ఆలోచిస్తాం: బీజేపీ నేత హరిబాబు


పవన్ కల్యాణ్ పార్టీ ‘జనసేన’ విధానాలు స్పష్టమైన తర్వాత దాని గురించి భవిష్యత్తులో ఆలోచిస్తామని ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విశాఖపట్టణం బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. 2019లో ‘జనసేన’ పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా తెరమీదకు వస్తే పవన్ తో కలిసి ప్రయాణం చేయడానికి బీజేపీ సిద్ధమేనా? అనే ప్రశ్నకు హరిబాబు స్పందిస్తూ...‘ఇది చాలా ఊహాజనితమైన ప్రశ్న. పవన్ కల్యాణ్ గారు.. రాజకీయంగా వారి దిశ ఏ విధంగా ఉండబోతున్నాయి, కొత్త రాజకీయ పార్టీ పెడతారా? లేక, వేరేవిధంగా ఆలోచిస్తారా? అనేవి స్పష్టమైన తర్వాత భారతీయ జనతా పార్టీ తప్పకుండా దాని గురించి ఆలోచిస్తుంది’ అని అన్నారు.

  • Loading...

More Telugu News