: తెలంగాణాలో ఆయిల్ ట్యాంకర్ల సమ్మె విరమణ


తెలంగాణలో ఆయిల్ ట్యాంకర్ల సమ్మెను విరమించారు. టీఎస్ ప్రభుత్వంతో పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల అసోసియేషన్ ప్రతినిధులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు చెప్పారు. కాగా, తమ నుంచి వసూలు చేస్తున్న 14.5 శాతం విలువ ఆధారిత పన్ను(వ్యాట్) ను ఎత్తివేయాలని కోరుతూ గత అర్ధరాత్రి నుంచి 3,500 కు పైగా ఆయిల్ ట్యాంకర్ల యజమానులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News