: యాగంటి ఆలయ ఈవోపై పెట్రోల్ దాడి చేసి హతమార్చేందుకు విఫలయత్నం
కర్నూల్ జిల్లాలోని యాగంటి ఆలయ ఈవో ఆదిశేషునాయుడుపై దాడి చేసి, పెట్రోల్ పోసి అంటించి హతమార్చేందుకు విఫలయత్నం జరిగింది. జూనియర్ అసిస్టెంట్ కృష్ణారెడ్డి ఈ అఘాయిత్యానికి యత్నించారు. దీంతో, అప్రమత్తమైన సిబ్బంది ఆయన్ని అడ్డుకున్నారు. జూనియర్ అసిస్టెంట్ విధులకు గైర్హాజర్ కావడంతో ఈవో ఆయన జీతాన్ని నిలిపివేశారన్న ఆగ్రహంతో ఈ దాడికి కృష్ణారెడ్డి పాల్పడినట్లు సమాచారం. ఈ సంఘటన నేపథ్యంలో ఆదిశేషునాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, బనగానపల్లెకు సమీపంలో ఉన్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీ ఉమామహేశ్వరస్వామి కొలువుతీరి ఉన్నారు. యాదాద్రి బసవన్నను చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమోననిపిస్తుందని భక్తులు చెబుతుండటం తెలిసిందే.