: తెలంగాణలో బాబుకు రక్షణగా నిలిస్తే ఇదా బహుమానం?: మంద కృష్ణ
తెలంగాణ ప్రాంతంలో చంద్రబాబునాయుడు పాదయాత్ర చేస్తున్న వేళ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున దగ్గరుండి రక్షణగా నిలిచామని, ఇప్పుడు తమను అరెస్టులు చేయిస్తున్నారని మంద కృష్ణ దుయ్యబట్టారు. బాబుకు రక్షణగా నిలిచినందుకు తమకు ఇచ్చిన బహుమానం ఇదేనా? అని ఆయన ప్రశ్నించారు. విజయవాడలో మీడియా సమావేశం పెట్టేందుకు వెళుతున్న తనను అడ్డుకోవడమేంటని ప్రశ్నించిన ఆయన, పోలీసులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వర్గీకరణపై చంద్రబాబు మాదిగలను తీవ్రంగా మోసం చేస్తున్నారని ఆరోపించారు. కాగా, విజయవాడ నగరంలోకి రాకుండా మంద కృష్ణను అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు, ఆయన్ను తిరిగి హైదరాబాద్ కు పంపుతున్నట్టు తెలుస్తోంది.