: మీ వ్యూవర్ షిప్ పెంచుకునేందుకు నన్ను కాంట్రవర్షియల్ చేస్తారా?: టీవీ9తో కేవీపీ


రాష్ట్రాభివృద్ధి, ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టు, దుగ్గరాజపట్నం పోర్టు వంటి ఎన్నో అపరిష్కృత అంశాలపై చర్చించాలని కోరుతున్నా, పదేపదే జగన్, ఎమ్మెల్యేల ఫిరాయింపులు, భవిష్యత్ పొత్తులు తదితరాలపై ప్రశ్నలు అడుగుతున్న టీవీ9 న్యూస్ ప్రెజెంటర్ మురళీకృష్ణపై కేవీపీ కొంత అసహనాన్ని ప్రదర్శిస్తూ మండిపడ్డారు. "మీరు రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెడుతున్నారు. మీ వ్యూవర్ షిప్ పెంచుకోవడానికి కాంట్రవర్షియల్ సబ్జెక్టు తీసుకొచ్చి, రామచంద్రరావును కాంట్రవర్షియల్ చేయడానికి, కాంగ్రెస్ పార్టీని కాంట్రవర్షియల్ చేయడానికి, దురదృష్టవశాత్తూ మీరు ప్రయత్నిస్తున్నారు" అని అన్నారు. కొత్త వివాదాలు, చర్చలకు తావిచ్చే అంశాల గురించి అసలు ప్రస్తావించనే వద్దని హితవు పలికారు.

  • Loading...

More Telugu News