: టీఆర్ఎస్ తో పొత్తు ప్రతిపాదన వచ్చినప్పుడు చూద్దాం: అమిత్ షా


టీఆర్ఎస్ తో పొత్తు ప్రతిపాదన వచ్చినప్పుడు చూద్దామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. హైదరాబాద్ లో బీజేపీ మండల నాయకుల రాష్ట్ర స్థాయి సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అన్నారు. టీఆర్ఎస్ పొత్తు కోసం తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని, వచ్చినప్పుడు చూద్దామని అన్నారు. 2019 నాటికి తెలంగాణలో బీజేపీ గొప్ప రాజకీయ శక్తిగా మారుతుందన్నారు. అంతకుముందు, బీజేపీ మండల నాయకుల రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ వల్ల భారత్ పేరు ప్రపంచంలో మారు మోగుతోందని అన్నారు. రానున్న రోజులన్నీ బీజేపీవేనని అన్నారు. బీజేపీపై ఆరోపణ చేయడానికి ప్రతిపక్షాల వద్ద ఏమీ లేదని, రెండేళ్ల క్రితం దేశంలో విచిత్ర పరిస్థితి ఉండేదని అమిత్ షా విమర్శించారు.

  • Loading...

More Telugu News