: రానున్న 32 గంటల్లో తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. క్యుములో నింబస్ మేఘాల ప్రభావం ఎక్కువగా ఉండటంతో రానున్న 32 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్టణం వాతావరణ శాఖ పేర్కొంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆ ప్రకటనలో సూచించింది. ఇదిలా ఉండగా, ఖమ్మం జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది ఈదురు గాలులకు తల్లాడ బస్టాండ్ సమీపంలోని రేకుల షెడ్డు కూలిపోయింది. ఈ సంఘటనలో ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. పలు చోట్ల చెట్లు విరిగి రోడ్డుపై పడటంతో ఖమ్మం-హైదరాబాద్ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.