: కాంగ్రెస్, వైఎస్సార్సీపీ లపై మండిపడ్డ మంత్రి యనమల


కాంగ్రెస్, వైఎస్సార్సీపీ లపై మంత్రి యనమల రామకృష్ణుడు నిప్పులు చెరిగారు. తిరుపతి మహానాడులో ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ నేడు పూర్తిగా భ్రష్టుపట్టిపోయిందని అన్నారు. కుళ్లు, కుతంత్రాలకు, అవినీతికి, దోపిడీకి చిరునామాగా నిలిచిన కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు తిరస్కరించారని అన్నారు. ఇక రాష్ట్రం విషయానికొస్తే, ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉన్నారని, రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కల్గిస్తున్నారని ఆయన ఆరోపించారు. దేశంలో ఎన్నో రకాల కాంగ్రెస్ లు వచ్చాయి, పోయాయి అని, వైఎస్సార్సీపీ రాష్ట్రంలో కనుమరుగు కావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. అంబేద్కర్ కలలు గన్న అభివృద్ధి సాధనే టీడీపీ లక్ష్యమని, దేశంలోనే ఏపీని నంబర్ వన్ గా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన హామీలు, ప్రత్యేకహోదా సాధనకు టీడీపీ అవలంబిస్తున్న విధానం మొదలైన అంశాలపై యనమల మాట్లాడారు.

  • Loading...

More Telugu News