: జగన్ కు ముద్రగడ కోవర్టుగా మారడం మంచిది కాదు: ఏపీ కాపు కార్పొరేషన్ అధ్యక్షుడు


వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కోవర్టుగా మారడం మంచిది కాదని ఏపీ కాపు కార్పొరేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. తిరుపతిలో మహానాడు మీడియా సమావేశ మందిరంలో ఆయన మాట్లాడుతూ, ముద్రగడ పద్మనాభం చర్యలతో రాష్ట్రంలో కాపులు అయోమయంలో పడ్డారని ఆయన విమర్శించారు. కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు ముద్రగడకు లేదని, జగన్ కు కోవర్టుగా ముద్రగడ మారడం మంచిది కాదని హితవు పలికారు. గతంలో కాపులకు అన్యాయం చేసిన వారిని ముద్రగడ కలిసి మద్దతు కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాపు సంక్షేమానికి ఏపీ సర్కార్ కట్టుబడి ఉందని రామాంజనేయులు అన్నారు.

  • Loading...

More Telugu News