: పోలీసు బాస్ కు తగిలిన క్రికెట్ బంతి... పోలీసుల అదుపులో పిల్లలు!
పిల్లలు ఆడుకుంటున్న క్రికెట్ బంతి ఒక పోలీసు అధికారికి తగలడంతో వారిపై మండిపడ్డ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో జరిగింది. స్థానికంగా నివసించే కొందరు పిల్లలు క్రికెట్ ఆడుకుంటుండగా, ఆ బంతి మొరాదాబాద్ ఐజీ బీఆర్ మీనాకు తగిలింది. దీంతో ఆగ్రహించిన మీనా ఆ పిల్లలను వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. పిల్లలను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లడంతో ఆందోళన చెందిన వారి తల్లిదండ్రులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సుమారు ఆరు గంటల తర్వాత పోలీసులు ఆ పిల్లలను విడిచిపెట్టారు.