: ఢిల్లీలో రోడ్డు ప్రమాదం... ఇద్దరు అద్దంకి వాసుల మృతి, స్పందించిన శిద్ధా


ప్రకాశం జిల్లా అద్దంకి ప్రాంతానికి చెందిన యాత్రికుల బృందం ప్రయాణిస్తున్న బస్సు ఢిల్లీలో ప్రమాదానికి గురైంది. వీరు ప్రయాణిస్తున్న బస్సు ట్యాంకర్ లారీని ఢీకొనగా, ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, 20 మంది వరకూ గాయపడ్డారు. విషయం తెలుసుకున్న ఏపీ మంత్రి శిద్ధా రాఘవరావు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంటనే స్వయంగా ఫోన్ చేసి ఏపీ భవన్ అధికారులను అప్రమత్తం చేశారు. యాత్రికులందరినీ ఏపీ భవన్ కు చేర్చి వసతి ఏర్పాట్లు చూడాలని ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్సను అందించి, ఆపై స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేయాలని సూచించారు.

  • Loading...

More Telugu News