: కలెక్టరుగా ఎందుకమ్మా?... నిన్ను రాజకీయ నాయకురాలిని చేస్తా: అనకాపల్లి విద్యార్థినితో చంద్రబాబు


రాజధాని నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పడుతున్న శ్రమను, అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి విశదీకరించి చెప్పిన అనకాపల్లి విద్యార్థిని హేమమాలిని మహానాడు వేదికపై చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. బాలిక ప్రసంగానికి ముగ్ధుడైన చంద్రబాబు, దగ్గరికి పిలిచి అభినందించడంతో పాటు కొద్దిసేపు మాట్లాడారు. చాలా బాగా మాట్లాడావని అభినందించి, ప్రతి టీడీపీ మీటింగులో మాట్లాడే అవకాశం ఇస్తానని, ఎమ్మెల్యేలు, నేతల కన్నా చక్కగా విషయాన్ని చెప్పావని అభినందించారు. తనకు చదువుకుని కలెక్టర్ కావాలని ఉందని, పదో తరగతిలో 9.8 గ్రేడ్ సాధించానని బాలిక చెప్పగా, ఆపై చదువులకు ఎన్టీఆర్ ట్రస్ట్ సాయపడుతుందని హామీ ఇచ్చిన చంద్రబాబు, కలెక్టరుగా కన్నా, రాజకీయాల్లో రాణిస్తావని, చదివించి మంచి నాయకురాలిని చేస్తానని చెప్పారు. వీరిద్దరి సంభాషణను మహానాడుకు తరలివచ్చిన అందరూ ఆసక్తిగా విన్నారు.

  • Loading...

More Telugu News