: పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా వి.నారాయణస్వామి.. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం
పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, కేంద్ర మాజీ మంత్రి వి.నారాయణస్వామిని నియమించనున్నట్లు కాంగ్రెస్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, కాంగ్రెస్ నేత ముకుల్ వాస్‌నిక్ తెలిపారు. వి.నారాయణస్వామి పుదుచ్చేరి ముఖ్యమంత్రి పదవిని స్వీకరించడానికి ఎన్నికైన సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫోన్‌లో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే మరో నేత నమశివాయం సీఎం పదివిని ఆశిస్తున్నారు. దీంతో నారాయణస్వామిని పార్టీ సీఎంగా ప్రకటించగానే, నమశివాయంకి మద్దతు తెలుపుతోన్న నేతలు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.