: అమితాబ్‌తో షోని అద్భుతంగా చేయడం కాదు.. దేశాన్ని అద్భుతంగా తీర్చదిద్దండి: జేడీయూ


‘అమితాబ్ తో షోని అద్భుతం చేయడం కాదు.. దేశాన్ని అద్భుతంగా తీర్చదిద్దండి’ అని ఎన్డీఏ ప్ర‌భుత్వంపై జేడీయూ విమ‌ర్శ‌లు గుప్పించింది. అధికారంలోకి వ‌చ్చి రెండు సంవత్స‌రాలు గడుస్తోన్న సందర్భంగా మ‌రికాసేప‌ట్లో ఢిల్లీలోని ఇండియా గేట్ వ‌ద్ద ఎన్డీఏ ప్ర‌భుత్వం ఉత్స‌వాలు జ‌రుపనున్న సంద‌ర్భంగా జేడీయూ నేత శ‌ర‌ద్ యాద‌వ్ స్పందిస్తూ.. దేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన త‌రువాతే, ప్ర‌భుత్వం అద్భుతంగా ఉత్సవాలు జ‌రుపుకోవాల‌ని అన్నారు. బీజేపీ రెండేళ్లు గ‌డిచిన సంద‌ర్భంగా నిర్వ‌హిస్తోన్న ఉత్సవాలను ఒక షోలాగా నిర్వ‌హిస్తోంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ప్రజాపాల‌నను గాలికి వ‌దిలేసి, సొంత ప్ర‌యోజ‌నాల కోసం హామీలిచ్చి గొప్ప‌లు చెప్పుకుంటోంద‌న్నారు. మోదీ ప్రభుత్వం రెండేళ్ల‌లో ఒక్క హామీని కూడా కార్య‌రూపంలో పెట్ట‌లేద‌ని ఆయన ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News