: మా మద్దతు ముద్రగడకే!: చిరంజీవి
తమ మద్దతు ముద్రగడ పద్మనాభంకు ఉంటుందని ప్రముఖ సినీ నటుడు, కాంగ్రెస్ నేత చిరంజీవి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమించిన ముద్రగడ వెనుక తాము నిలబడతామని అన్నారు. కాపులకు రిజర్వేషన్ పై ముద్రగడ చేస్తున్న ఉద్యమం ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్ కార్యాచరణను ముద్రగడ తనకు వివరించారని, ఆయనకు తమ పూర్తి మద్దతు ఉంటుందని, ఆయన సాధించాలనుకున్నది సాధిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఆగస్టులోగా కాపు రిజర్వేషన్ కల్పించాలని, లేని పక్షంలో మరోసారి ఉద్యమిస్తామని ముద్రగడ ప్రభుత్వాన్ని హెచ్చరించిన సంగతి తెలిసిందే. టీడీపీ కాపు నేతలు నాయకులుగా ఎదిగే క్రమంలో చేస్తున్న వ్యాఖ్యలతో ముద్రగడను రెచ్చగొడుతున్నారని పలువురు కాపు నేతలు అభిప్రాయపడుతున్నారు.