: హర్మాన్ బవేజా తమ్ముడి వీడియో లీక్...వైరల్
బాలీవుడ్ నటుడు (ప్రియాంకా చోప్రా మాజీ ప్రియుడు) హర్మాన్ బవేజా తమ్ముడు జానీ బవేజా వ్యక్తిగత వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 'స్కాండల్' అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తున్న జానీ బవేజా ఆ సినిమాలోని ఓ ఘాటైన సన్నివేశంలో నటిస్తుండగా తీసిన 17 సెకెన్ల నిడివి కలిగిన సీన్ యూట్యూబ్ లో ప్రత్యక్షమైంది. దీంతో జానీ నిరాశకు గురయ్యాడు. రిహార్సల్ చేస్తుండగా తీసిన సీన్ ను లీక్ చేశారని, యూనిట్ కు తెలియకుండా లీక్ చేయడం తమను ఆశ్చర్యానికి గురి చేసిందని జానీ తెలిపాడు. ఇలాంటి వీడియోను ఎలా లీక్ చేస్తారని జానీ ప్రశ్నించాడు. కాగా, బాలీవుడ్ లో ఆయా సినిమాలకు హైప్ తెచ్చేందుకు నిర్మాతలు ఇలాంటి గిమ్మిక్కులకు పాల్పడ్డ సంఘటనలు గతంలో చాలానే ఉన్నాయి.