: ధావన్, ఏంటిది?...ఇప్పటికైనా ఆడు: గంగూలీ సూచన


'శిఖర్ ధావన్, ఇప్పటికైనా ఒళ్లు దగ్గరపెట్టుకుని ఆడు' అంటూ టీమిండియా మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ సూచించాడు. గత సీజన్లలో ఆకట్టుకున్న ధావన్ ఈ సీజన్ లో ఆకట్టుకోలేకపోయాడు. నిర్లక్ష్యంగా షాట్లు ఆడుతూ అనవసరంగా వికెట్ పారేసుకుంటున్నాడు. దీంతో ఆడే విధానం అది కాదని ధావన్ కు గంగూలీ హితవు పలికాడు. కనీసం ఫైనల్లో అయినా జాగ్రత్తగా ఆడాలని సూచించాడు. వార్నర్ ఒక్కడే ఆడితే ఫైనల్లో రాణించడం సులువు కాదని చెప్పాడు. టీమిండియాకు ధావన్ కీలకమైన బ్యాట్స్ మన్ అని చెప్పిన గంగూలీ, ఐపీఎల్ లో ఆ జట్టుకు కూడా ధావన్ కీలకమన్న విషయం గుర్తుంచుకోవాలని చెప్పాడు. ఫస్ట్ క్వాలిఫయర్, సెకెండ్ క్వాలిఫయర్ లో కూడా ధావన్ సరిగ్గా ఆడలేదని, ఫైనల్లో ఆడుతాడని, వార్నర్ కు అండగా నిలబడతాడని ఆశిస్తున్నానని తెలిపాడు. కోల్ కతాతో, గుజరాత్ తో వార్నర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగా, బిపుల్ శర్మ అండతో మధురమైన విజయం అందించాడని గంగూలీ తెలిపాడు.

  • Loading...

More Telugu News