: కాపు రిజర్వేషన్లకు సోనియా, రాహుల్ మద్దతు: రఘువీరా
కాపుల రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మద్దతు ఉంటుందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చెప్పారు. కాపు రిజర్వేషన్ల అంశంపై ఆ వర్గ ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తనను కలిసిన సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ముద్రగడకు ఆయన మద్దతు తెలిపారు. కాపుల రిజర్వేషన్ల పట్ల తాము సానుకూలంగా ఉన్నామని, తమ పార్టీ అధిష్ఠానం కూడా మద్దతు పలుకుతోందని పేర్కొన్నారు. కాపులకు రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ఇప్పటికే కృషి చేస్తోందని ఆయన తెలిపారు.