: సల్మాన్ ఖాన్‌పై బాలీవుడ్ భామ ప్రశంసల జల్లు
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ పై నటి జరీన్ ఖాన్ ప్రశంసల జల్లు కురిపించింది. తనకు అసలు హీరోయిన్ అయ్యే ఆలోచనే వుండేది కాదని, అయితే సల్మాన్ ఖాన్ వల్లే తాను హీరోయిన్ అయ్యానని అంటోంది. 'వీర్' సినిమాతో జరీన్ ను సల్మాన్ హీరోయిన్ గా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. సల్మాన్ ను ఎన్నోసార్లు పొగడ్తలతో ముంచెత్తిన జరీర్.. సల్మాన్ ఖాన్ కి ఎంతో రుణపడి ఉన్నానని మరోసారి తాజాగా పేర్కొంది. బాలీవుడ్‌లో ‘నేను నిలదొక్కుకున్నానంటే ఆ ఘనత సల్మాన్ దే’నని చెప్పింది. కండల వీరుడితో మరోసారి కలిసి నటించే ఛాన్స్ వస్తే అంతకన్నా సంతోషం మరొకటుండదని ఈ అమ్మడు అంది.