: ఎన్టీఆర్ ఘాట్ కు అత్తాకోడళ్లు!... ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన భువనేశ్వరి, బ్రాహ్మణి
నందమూరి ఆడపడుచులు, నారావారి ఇంటి కోడళ్లు నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లారు. తన తండ్రి దివంగత సీఎం, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావుకు నివాళి అర్పించేందుకు కోడలు బ్రాహ్మణితో బయలుదేరిన భువనేశ్వరి ఎన్టీఆర్ కు నివాళి అర్పించారు. ఎన్టీఆర్ కూతురిగా నారా చంద్రబాబునాయుడిని పెళ్లి చేసుకున్న భువనేశ్వరి, తన తమ్ముడు నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మణిని తన కొడుకు నారా లోకేశ్ కిచ్చి వివాహం జరిపించారు. ఈ క్రమంలో నందమూరి వంశానికి చెందిన ఈ అత్తాకోడళ్లు నారావారి ఇంటి కోడళ్లుగా మారిపోయిన సంగతి తెలిసిందే. భర్తలు లేకుండా అత్తాకోడళ్లు మాత్రమే కలిసి వారు బయటకు రావడం ఇదే తొలిసారి.