: గుండె ఆపరేషన్ కోసం లండన్ కు పాక్ ప్రధాని!... త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్ష!


పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ గుండె ఆపరేషన్ కోసం ఈ నెల 31న లండన్ వెళ్లనున్నారు. కూతురును వెంటబెట్టుకుని లండన్ వెళ్లనున్న నవాజ్... అక్కడి ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకుని ఆ తర్వాత వారం పాటు చికిత్స తీసుకోనున్నారు. ఈ మేరకు పాక్ రక్షణ శాఖ మంత్రి ఖాజా ఆసిఫ్ ట్విట్టర్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. నవాజ్ షరీఫ్ కు ఆపరేషన్ జరగనున్న విషయం తెలుసుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ వేగంగా స్పందించారు. నవాజ్ షరీఫ్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు మోదీ తన ట్విట్టర్ ఖాతాలో కొద్దిసేపటి క్రితం ట్వీట్ పోస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News